Sunday, January 19, 2025

హైకోర్టు గేటు వద్ద జనం చూస్తుండగానే కత్తితో పొడిచి… పోలీసులకు ఫోన్ చేశాడు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. హైకోర్టు గేట్ నం.6 సమీపంలోని సులబ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న మిథున్ అనే వ్యక్తి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. పది వేల రూపాయల విషయంలో నిందితుడికి- మిథున్ మధ్య గొడవ జరిగింది. గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో దుండగుడు జనం చూస్తుండగానే మిథున్ ను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: వరల్డ్ టాప్ స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ ఎక్కడుందంటే…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News