Monday, December 23, 2024

పాతబస్తీలో ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రియురాలుపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రావ్య(32) అనే మహిళ తన తల్లితో కలిసి పాతబస్తీలో ఉంటుంది. ఆమె తల్లి పాతబస్తీలో ఓ డెంటల్ ఆస్పత్రిలో పని చేస్తుంది. శ్రావ్య 2019లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. శ్రావ్యకు మణికంఠ అనే చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. దీంతో ఆమెతో మణికంఠ ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో మణికంఠను శ్రావ్యవ దూరం పెట్టడంతో ఆమెపై పగపెంచుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తుందని అనుమానం కూడా పెంచుకున్నాడు.

తల్లి జాబ్‌కు వెళ్లగా కూతురు అప్పుడే జిమ్‌కు వెళ్లి కూతురు ఇంటికి వచ్చింది. ఎవరు లేనప్పుడు ఇంట్లోకి మణికంఠ చొరబడి శ్రావ్యతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తిపీట తీసుకొని ఆమెపై దాడి చేశారు. అరుపులు కేకలు వినపడడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రావ్య, మణికంఠ గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలివచ్చినట్టు సమాచారం. అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News