Friday, January 10, 2025

హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీదేవి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్ అయ్యారు. శ్రీదేవిని గురువారం సాయంత్రం ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ సిడిపిఒగా పనిచేసిన సమయంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చుల్లో జరిగిన అవకతవకలపై కేసు నమోదు చేశారు. నకిలీ ఇండెంట్లు సృష్టించి నగదు కాజేసినట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. మొత్తం రూ.65.78 లక్షలు దారి మళ్లించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తిం చారు. దాదాపు 322 అంగన్వాడీ కేంద్రాల నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడించారు. ఈ స్కామ్ 2015-2016 సమయంలో జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News