Friday, March 21, 2025

పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

వ్యక్తిగతంగా హాజరుకండని నోటీసు!

హైదరాబాద్: తిరుపతి లడ్డూలో నిషేధిత జంత కొవ్వు వాడారని కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాడు అది సంచలనం అయింది.  కాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలయింది. న్యాయవాది రామారావు  ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు వ్యాఖ్యలు చేశారని పిటిషనర్  పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాది రామారావు పిటిషన్ ను కోర్టు అక్టోబర్ 21 విచారణకు స్వీకరించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు కోర్టుకు వ్యక్తిగతంగా  నవంబర్ 22న హాజరు కావాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News