Thursday, January 23, 2025

హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ హబ్‌గా గుర్తింపు

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఒక రియల్ ఎస్టేట్ హబ్‌గా గుర్తింపు పొందడం జరిగిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం మాదాపూర్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ది టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో 2023 ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ బిల్డర్లు 36మంది, 100కి పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు, ప్రీమియం వెంచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ హబ్‌గా గుర్తింపు పొందిందన్నారు.

దేశంలోని ఇతర నగరాలను వెనుకకు నెడుతూ హైదరాబాద్ రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ రెండిరటిలోను భాగా పుంజుకుందన్నారు. ఏడాదికేడాది హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన, ఆకర్షిణీయమైన నగరంగా గుర్తింపు పొందుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధ్దిపై, శాంతి సామరస్యాలపై ముఖ్యంగా హైదరాబాద్‌లో దృష్టి సారించామన్నారు. పౌరులకు ఒక భద్రతా భావాన్ని అందించిన తర్వాత స్థానికులు, బయటి నుంచి వచ్చే వారు అ టు భారతదేశం లేదా విదేశాల నుండి వచ్చే వారు, ఏడిదికేడాది జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. కొత్త రోడ్లు ఏర్పాటు చేయడం పట్ల కొత్త ఫ్లైఓవర్లతో నగరాన్ని కలపడం పట్ట వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News