Sunday, December 22, 2024

కేక్ కట్ చేసిన సిపిలు

- Advertisement -
- Advertisement -

Hyderabad City Police Commissioner Cake Cutting

హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తు ముగ్గురు పోలీస్ కమిషనర్లు కేక్‌లు కట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్, కెబిఆర్ పార్క్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, కోఠిలోని ఆంధ్ర బ్యాంక్, చార్మినార్ వద్ద కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. నగర ప్రజలు కొత్త ఏడాది ఆయురారోగ్యాలతో ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కేక్ కట్ చేశారు. హోంగార్డుకు కేక్ తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కొత్త ఏడాదిలో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఎల్‌బి నగర్‌లోని అలకాపురి చౌరస్తాలో కేక్‌ను కట్ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News