Saturday, November 23, 2024

నేచర్‌క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రులను సందర్శించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Hyderabad Collector visited Nature Cure and Ayurvedic hospitals

హైదరాబాద్: జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి నగరంలోని నేచర్ క్యూర్, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులను శనివారం సందర్శించారు. ఆసుపత్రుల్లో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు గురించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో డిసెంబర్ 2020 వరకు ఐసోలేషన్ కేంద్రాలుండగా, వాటిని కరోనా ప్రభావం తగ్గడంతో తొలగించారు. మళ్లీ కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో వాటిని తెరవడానికి ఏర్పాట్లు గురించి అక్కడి ఆసుపత్రుల సూపరింటెండెట్స్, ఇతర వైద్యాధికారులతో సమీక్షించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటి, నేచర్‌క్యూర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.భవాని, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పరమేష్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News