Friday, December 20, 2024

ఆ విషయంలో ఢిల్లీతో హైదరాబాద్ పోటీ

- Advertisement -
- Advertisement -

వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ కూడా ఢిల్లీని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. తాజాగా హైదరాబాద్ కూడా ఇదే బాటపట్టింది. దీపావళి మరునాడు.. అంటే సోమవారం గాలి నాణ్యతను తనిఖీ చేస్తే, ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది.

హైదరాబాద్ వాయు నాణ్యత సూచీ (ఏక్యుఐ) డేటా ప్రకారం నగరంలో ఉన్న పదిహేను తనిఖీ కేంద్రాలలో, యుఎస్ కాన్సులేట్ స్టేషన్ వద్ద అత్యధికంగా 341 పాయింట్లుగా ఏక్యుఐ నమోదైంది. ఇది వాయు కాలుష్యం పెరిగిందనడానికి సూచన. ఇక కేపీహెచ్ బీ లో 237, జూ పార్కు వద్ద 213, న్యూ మలక్ పేట లో 197, సోమాజీగూడలో 177, సైదాబాద్ లో 170, కోఠిలో 160, బంజారా హిల్స్ లో 107పాయింట్లుగా వాయు నాణ్యత రికార్డయింది.

అయితే ఎప్పుడూ వాయు నాణ్యత  ప్రమాదకరస్థాయిలో ఉండే కోకాపేటలో ఈసారి ఏక్యుఐ 30గా నమోదు కావడం విశేషం. అలాగే మణికొండ, మాదాపూర్, సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నట్లు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News