ఏడు స్థానాల్లో ప్రకటించని అభ్యర్థులు
వర్గాలుగా విడిపోయిన ఆశావహులు
ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు రెబల్‌గా బరిలో, అభ్యర్థులను ప్రకటిస్తే అసమ్మతి
ఖాయం అన్న భయం
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల ఎంపికలో హస్తం పార్టీ వెనకబడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 17 శాసనసభ స్థానాలకు గాను ఇప్పటివరకు కేవలం 10 మందికి మాత్రం టికెట్‌లు ప్రకటించింది. టికెట్‌లు ప్రకటించిన నియోజకవర్గాలో టికెట్ దక్కని నేతలు చాలా మంది హస్తంకు హ్యండ్ ఇచ్చి కారు ఎక్కి షికారు చేయడానికి వెళ్లడంతో మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థ్దుల ఎంపికలో పార్టీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఉప్పల్ టికెట్ వ్యవహరం దుమారం రేపడం…చెవెళ్లలో నేతల ఆలకలతో పార్టీ మిగత స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికిప్పుడు తేల్చకుండా నాన్చుతుంది. బిఆర్‌ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసి దూకుడుగా ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే హ స్తం అభ్యర్థ్దుల ఎంపిక వద్దనే ఉంది.
ఉమ్మడి జిల్లాలోని చెవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, వికారాబాద్, పరిగి, కొడంగల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థ్దులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహింపట్నం, శేరిలింగంపల్లి, ఎల్.బి .నగర్, తాండూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల అభ్యర్థ్దులను పెండింగ్‌లో పెట్టింది. అభ్యర్థ్దులను ప్రకటించిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తిమీద సాములాగా మారింది. ఒక్కో నియోజకవర్గ టికెట్ కోసం పదుల సంఖ్యలో ఆశావాహూ లు ఉండటంతో పాటు ఎవరి స్థాయిలో వారు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.ఆర్థిక, అంగ బలాల్లో సైతం ఆశావహూలు పోటిపడుతు భారీగా ఖర్చు చేస్తు టికెట్ కోసం పైరవీలు చేసుకుంటున్నారు. ఒక అభ్యర్థ్ది కర్నాటక డిప్యూటీ సిఎం డి.కె.శివకుమార్ పైరవీ చేస్తుంటే మరోనేత డిల్లీ స్థాయిలో లాబియింగ్ జరుపుతున్నారు.
టికెట్ కోసం పోటాపోటిగా: ఎడు నియోజకవర్గాల్లో టికెట్ కోసం హోరాహోరాగా నేతలు పోటిపడుతున్నారు. మహేశ్వరం టికెట్ కోసం డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డిలతో పాటు పలువురు డిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. మహేశ్వరం టికెట్ ఎవరికి దక్కిన మరోనేత మంత్రి సబితారెడ్డికి జై కొట్టడమా…మరో పార్టీ టికెట్ దక్కించుకుని పోటి చేస్తారు తప్ప పార్టీ కోసం పనిచేసే వారు చాలా తక్కువ మ ంది కనిపిస్తున్నారని స్వంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మహేశ్వరం హ స్తం ఆశావహులంత పూర్వశ్రమమంలో మంత్రి సబితారెడ్డి అనుచరులు కావడం విశేషం. ఇబ్రహింపట్నం టికెట్ కోసం మాజీ ఎ మ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డితో పాటు మర్రి నిరంజన్ రె డ్డి, దండెం రాంరెడ్డిలతో పలువురు పోటి ప డుతున్నారు.
మ ల్‌రెడ్డి రంగారెడ్డికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మ ర్రి నిరంజన్‌రెడ్డికి స్థానిక ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దండెం రాంరెడ్డికి ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు మద్దత్తు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దండెం రాంరెడ్డి రెండు రోజుల క్రితం బెంగళూర్ లో డి.కె.శివకుమార్ ను సైతం కలిసి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ము గ్గురిలో ఎవరికి టికెట్ వచ్చిన మరోనేత బిఎస్‌పి, ఫార్వర్డ్ బ్లాక్ తరపు న బరిలోకి దిగడానికి ఇప్పటికే కావలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. కా ంగ్రెస్ ఆశావాహూలు ప్రయత్నాలు ఇలా ఉంటే సిపియం సైతం పట్నం టి కెట్‌పై ప్రయత్నాలు చేస్తుండటం కొసమెరుపు. ఎల్.బి.నగర్ టికెట్ కోసం మాజీ ఎంపి మదుయాష్కి గౌడ్ డిల్లీ లాబియింగ్ చేస్తుండగా స్థానిక నేతలు తమ వంతు దింపుడు కల్లెం ఆశలతో ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఎవరికి వచ్చిన మరో వర్గం సహకరించే సీన్ లేదనేది స్పష్టం. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి టికెట్ కోసం సైతం వందల కోట్ల ఆస్తులు, అంగ బలం ఉన్న నేతలు పోటిపడుతున్నారు.
గ్రేటర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆయన సతీమణి పూజిత రెండు రోజుల క్రితం బిఆర్‌యస్ వదిలి కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ ఖాయమైన తర్వాతనే పార్టీలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. శేరిలింగంపల్లి టికెట్‌పై మరో బడానేత రఘనాథ్ యాదవ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీలో చేరి పెద్ద మొత్తంలో పార్టీ కోసం ఖర్చు చేసి టికెట్‌పై దీమాతో ఉన్నారు.
ఇ ద్దరిలో ఎవరికి టికెట్ వచ్చిన మరోనేత సహకరించే వాతావరణం కనిపించ డం లేదు. తాండూర్ సీటు పంచాయతీ పార్టీలో చిచ్చు లేపడం ఖాయం. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి బరిలోకి దిగడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన అనంతరం తాజాగా బిఆర్‌యస్‌కు చెందిన డిసిసి బి చైర్మెన్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం….సీటుపై బరోసా వచ్చిన త ర్వాతనే పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుండటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ వచ్చిన మరో వర్గం హ్యండ్ ఇవ్వడం ఖాయం.
రెండు స్థానాలో పోటి నామమాత్రమే… రాజేంద్రనగర్, కూకట్‌పల్లి స్థా నాల్లో ఆశావహులు చాలా మంది ఉన్న బరిలోకి దిగి పార్టీని విజయతీరాలకు చేర్చే నాయకులు మాత్రం పెద్దగా కనిపించకపోవడంతో పార్టీ పెద్దలు వలస నేతల కోసం వేచిచూస్తున్నారు. రాజేంద్రనగర్‌లో పోటికి పెద్ద తలకాయలు ఆసక్తీ చూపకపోయిన చిన్న చితక నేతలు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానిక నేతలు ఎవరు కూడ బిఆర్‌ఎస్ అభ్యర్థ్దికి కనీసం గట్టి పోటి ఇచ్చే సీన్ లేకపోవడంతో పార్టీ ప్రత్యామ్నాయ నాయకుడి వేటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో పోటి చేసి పరాజయం పాలైన జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కూకట్‌పల్లిలో వలస క మ్మ నేత కోసం వల వేసి ఎదురుచూస్తున్నారు. టికెట్ వచ్చిన నేతలు ప్రచారం ప్రారంబించిన టికెట్ రాని నేతలు టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్‌తో పాటు ప్రత్యర్ధి పార్టీ దూకుడుగా పోతుంది అన్న టెన్షన సైతం పెట్టుకున్నారు.