Monday, January 20, 2025

ర్యాలీకి సహకరించండి

- Advertisement -
- Advertisement -

Hyderabad CP CV Anand meeting with Muslim religious leaders

ముస్లీం మత పెద్దలతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సమావేశం

మనతెలంగాణ, హైదరాబాద్: మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లీం మతపెద్దలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగర సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కమ్యూనిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీ సందర్భంగా యువకులు నిబంధనలు పాటించేలా మతపెద్దలు, పెద్దలు చూడాలని అన్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. విద్వేషాలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో పోలీస్ అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News