Monday, November 18, 2024

పబ్బులకు నగర సిపి వార్నింగ్

- Advertisement -
- Advertisement -
Hyderabad CP warns to Pubgs
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

హైదరాబాద్: నగరంలోని పబ్బులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. మైనర్లకు మద్యం అమ్మవద్దని, దీనిని పాటించని వారిపై చర్యలు తప్పవని అన్నారు. నూతన సంవత్సర వేడుకలపై ఆరోగ్య శాఖ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. కొన్ని ఆంక్షలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News