Thursday, December 26, 2024

ముగిసిన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఫలితాలు

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టు నియమించిన ఏక సభ్య కమిటీ జస్టిస్ నాగేశ్వర రావు పర్యవేక్షణలో నిర్వహించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలీంగ్ మధ్యాహ్నం 3 గంటలకు వరకు కొనసాగింది. మొత్తం 173 మంది సభ్యుల్లో 169మంది సభ్యులు తమ ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

అధికార పార్టీ బిఆర్‌ఎస్ బలపరుస్తున్న అర్శనపల్లి జగన్‌మోహన్ ప్యానెల్‌తో సహా మరో మూడు ప్యానెల్‌లు ఎన్నికల్లో పోటీ చేశాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, జగన్‌మోహన్ రావు ప్యానెల్, హెచ్‌సిఎ మాజీ అధ్యక్షులు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌లు బలపరుస్తున్న ప్యానెల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరిలోనే ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News