Friday, December 20, 2024

తక్కువ ధరకు కార్ల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన వి. డేని రతన్నంకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు చంద్రశేఖర్ అని మహీంద్రా సిఐఈ ఆటోమోటివ్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. తమ కంపెనీ సెక్యూరిటీ కోసం బెంగళూరు, తిరుపతి పలు ప్రాంతాల్లో కావాలని చెప్పాడు. వచ్చే జనవరి, 2024 నుంచి పని తీసుకుంటామని చెప్పాడు. మాటల్లో తమ కంపెనీలో ఉన్న డెమో కార్లను వేలం పాటలో విక్రయిస్తున్నారని, తక్కువ ధరకు విక్రయిస్తారని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లు బ్యాంక్ ఖాతాలకు రూ.3,54,236 పంపించాడు.

డబ్బులు వారికి అందినప్పటి నుంచి నిందితులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసి నిందితులు ఎపికి చెందిన తాడి నవీన్‌కుమార్, కంచర్ల మధు, శ్రీనివాస్ దుర్గా ప్రసాద్ కలిసి పలువురు అమాయకులకు ఫోన్లు చేసి మోసం చేస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News