Tuesday, November 5, 2024

నగర సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్‌కు అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహేష్ కో ఆపరేటీవ్ బ్యాంక్ కేసులో సమర్థవంతంగా పనిచేసిన ఇన్స్‌స్పెక్టర్ హరిభూషన్ రావు కేంద్ర హోం శాఖ థర్డ్ ప్రైజ్‌ను అందజేసింది. ఢిల్లీ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్(ఎన్‌సిఆర్‌బి) కార్యక్రమంలో అవార్డును అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన మహేష్ కో ఆపరేటీవ్ బ్యాంక్ సర్వర్లన్ హ్యాక్ చేసి కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో వేగంగా స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న రూ.2.08కోట్లు ఎటిఎంల నుంచి విత్‌డ్రా చేసుకోకుండా ఆపివేశారు.

మరో 1.08కోట్లను తిరిగి సైబర్ నిందితుల ఖాతాల నుంచి బ్యాంక్‌లో డిపాజిట్ అయ్యేలా చేశారు. ఈ కేసులో 27మంది నిందితులను అరెస్టు చేశారు. అందులో నలుగురు నైజీరియన్లు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాల వివరాలు సేకరించిన ఎన్‌సిఆర్‌బి విజయవంతంగా సైబర్ నేరాలను అడ్డుకున్న వారికి అవార్డులు ఇచ్చారు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ హరిభూషన్ రావు అవార్డును అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News