హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై సందర్శకులు ఆదివారం సాయంత్రం పులకించిపోయ్యారు. జంట నగరాలకు మణిహరంగా ఉన్న హుస్సెన్ సాగర్ కట్టపై ఆదివారం సాయంత్రం సంధ్యవేళా ఆహ్లాదకరమైన చల్లని వాతావరణలో నగరవాసులు సేద తీరారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల రాకపోకలను 3 గంటల పాటు నిషేదించిన నేపథ్యంలో సందర్శకులు తమ కుటుంబ సభ్యులతో రోడ్లపై స్వేచ్చగా విహరిస్తూ ట్యాంక్‌బండ్ అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారు. గత వారంతో పోల్చితే ఈ వారం సందర్శకుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో ట్యాంక్ బండ్ పూర్తిగా కిటకిటలాడింది.
ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన డిప్యూటీ మేయర్
మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి కుటుంబ సభ్యలతో కలిసి ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌ను సందర్శిస్తూ ఆహ్లాదాకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ మీదికి ఇలా రావడం పిక్నిక్ వచ్చినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ట్యాంక్‌బండ్‌కు వచ్చిన నగరవాసులతో ముచ్చటించిన డిప్యూటీ మేయర్ ఆదివారం 3 గంటల పాటు ఫ్రీ జోన్‌గా ఉండడం ఎలా ఉందని ఆరా తీశారు.