Thursday, January 23, 2025

పౌరులే ప్రాతిపదికగా ప్రగతి పథం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా నగరం నలువైపులా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పౌరుల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పాతబస్తీ ఎనిమిది సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కె. తారకరామారావు అధికారులతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మం త్రి మహమూద్ అలీ, ఎంఐఎం సభ పక్షనే త అక్బరుదుద్దీన్ ఒవైసీ, చెవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, జలమండలి, విద్యుత్ శాఖతో పాటు జిల్లా కలెక్టర్, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పా ల్గొన్నారు.

పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సమావేశంలో అందజేశా రు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడు తూ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం మొదటి నుంచి పాటుపడుతుందని, ఇప్పటికే నగరం నాలుగు దిశల విస్తరిస్తూ అద్భుతమై న ప్రగతితో ముందుకు పోతుందన్నారు. ప్రాం తాలు, పార్టీలకు అతీతంగా నగరాన్ని నలు మూ లల అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటిదాకా ఇదే ఆలోచనతో అన్ని ప్రాం తాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని కెటిఆర్ తెలిపారు. జిహెచ్‌ఎంసి చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి కార్యక్రమంలో భాగంగా పాతబస్తీ ప్రాంతంలోనూ భారీగా రోడ్డు నెట్‌వర్క్ బ లోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు వేగం గా కొనసాగుతున్నాయని, ఇందులో ఇప్పటికీ పలు ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమం కింద దాదాపు వందల కోట్లతో అనేక పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి చేపట్టిన సిఆర్‌ఎంపి కార్యక్రమం ద్వారా ప్రధాన రోడ్ల నిర్వహణ ప్రభావవంతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీలాంటి ప్రాంతాల్లో రోడ్డు వైండింగ్ కార్యక్రమం కొంత సవాల్‌తో కూడుకుందని, అయితే రోడ్డు వైండింగ్ తప్పనిసరి అయినా ప్రాంతాల్లో దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కెటిఆర్ అదేశించారు. పాతబస్తీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్ లతో పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అవసరమైన చోట మూసీనదిపై బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని కెటిఆర్ తెలిపారు.

తాగునీటి సౌకర్యాల అభివృద్ధి కోసం రూ.1200 కోట్లు

ప్రతి ఒక్కరికీ సరిపడా త్రాగునీరు అందించాలన్న ఒక బృహత్ సంకల్పంతో ప్రభుత్వం ముందుకుపోతుందని, అందులో భాగంగా నగరంలోని త్రాగునీటి సరఫరా సంతృప్తికర స్థాయిలో ఉందని కెటిఆర్ తెలిపారు. 8 సంవత్సరాల్లో పాతబస్తీ పరిధిలో తాగునీరు సరఫరా మెరుగుపడిందన్నారు. ఇందుకోసం వివిధ తాగునీటి సౌకర్యాల అభివృద్ధి కోసం సుమారు రూ.1200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా పాతబస్తీలో రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత త్రాగునీరు అందుతుందని కెటిఆర్ తెలిపారు. జలమండలి ద్వారా మురికినీటి వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం పాతబస్తీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సీవర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు ఇతర కార్యక్రమాలను జలమండలి చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌తో పాటు పాతబస్తీలోను విద్యుత్ సరఫరా వ్యవస్థ అద్భుతంగా మెరుగయ్యిందని కెటిఆర్ తెలిపారు. పారిశుధ్య నిర్వహణ విషయంలోనూ జిహెచ్‌ఎంసి తీసుకున్న ప్రత్యేక చర్యలతో పాతబస్తీలో పరిస్థితి ఎనిమిది సంవత్సరాల్లో పురోగతి సాధించిందని కెటిఆర్ తెలిపారు. ముఖ్యంగా చార్మినార్, చౌమహాల్లా ప్యాలెస్, మదీనా, మక్కా మసీద్, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు కెటిఆర్ తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాల అమలుతో పాటు, ప్రత్యేకంగా 84 బస్తీ దవాఖానాలను ఇప్పటిదాకా పాతబస్తీలో ఏర్పాటు చేసినట్లు కెటిఆర్ తెలిపారు.

ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మీర్ ఆలం మండి మార్కెట్ రిస్టోరేషన్ కోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మీర్ ఆలం ట్యాంక్ పైనుంచి ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు సైతం డిపిఆర్ దశలో ఉన్నట్లు కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న అనేక వారసత్వ కట్టడాలు, వారసత్వ సంపద ప్రధానంగా పాతబస్తీలో ఉన్న నేపథ్యంలో, వాటిని రక్షించడంతో పాటు పునరుజ్జీవన కార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున చేపట్టిన అంశాన్ని కెటిఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.

మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన అక్బరుద్దీన్

హైదరాబాద్ అభివృద్ధిలో పాతబస్తీ ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వడంపై అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా పాతబస్తీలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను మంత్రి కెటిఆర్ దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను, క్షేత్రస్థాయిలో తాము అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News