Monday, January 13, 2025

కేటీఆర్‌కు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు

- Advertisement -
- Advertisement -

ఈకార్ రేసుతో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రాలేదు
హైడ్రాతో ప్రభుత్వానికి నష్టమే!
నేను ఏది మాట్లాడినా సెన్సేషనే?
మీడియాతో ఎమ్మెల్యే
దానం నాగేందర్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో : “నేను ఏది మాట్లాడినా.. సెన్సేషనల్‌గా మారుతుంది. ఫార్ములా ఈ కారు రేసు చంద్రబాబునాయుడు హయాంలోనే వచ్చింది. అది ఇప్పటిది కాదు. ఈ-కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ అదనంగా వచ్చిందే తప్ప కొత్తగా వచ్చిందేమి కాదు. కానీ అవినీతి జరగలేదని నేను చెప్పలేదు. కేటీఆర్‌కు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు” అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి జీహెచ్‌ఎంసికి వచ్చిన ఆయన.. విలేకరులతో ముచ్చటిస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హైడ్రా వల్ల ప్రభుత్వానికి నష్టమని చెప్పాను. హైడ్రాపై తాను చేసిన వాఖ్యలు ఇప్పుడు కూడా మారవు. ప్రభుత్వం హైడ్రాపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. అయితే మూసీ సుందరీకరణ చేయాల్సిందేనని హైడ్రాపై తన అభిప్రాయాన్ని దానం నాగేందర్ మరోసారి స్పష్టంచేశారు. కొందరు ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పడం కాదు.. ఈ కార్ రేసు వల్ల అదనంగా మరింత గుర్తింపు నగరానికి వచ్చిందే తప్ప.. కేవలం ఈకార్ రేసు వల్లనే ఇమేజ్ పెరిగిందనడం సరైందికాదు అని నాగేందర్ వివరించారు.

ఓఆర్‌ఆర్‌తోనే బ్రాండ్ ఇమేజ్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) ద్వార్లా హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని దానం నాగేందర్ పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఏలాంటి వాస్తంలేదన్నారు. తనపై ఏ మంత్రి సీరియస్‌గాలేరని, పుకారు ్లమాత్రమే వస్తున్నాయంటూ ఆయన వాటిని కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పెద్దఎత్తున సంబురాలు చేయడంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయాల్సి ఉండే..కానీ అది ఎక్కడా చేయలేదన్నారు.

మూసీ విషయంలో బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ పార్టీ నేతలు చేసింది మూసీ నిద్ర కాదని, ఏసీ నిద్రని ఎద్దేవా చేశారు. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారని విమర్శించారు.బస్తీల వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టెలు తినకుండా.. కిషన్‌రెడ్డి బయట నుండి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాడని విమర్శించారు. నేను ఫైటర్ ను, ఉప ఎన్నికలకు సైతం భయపడనన్నారు. మూసీకి అనుకుని హై కోర్టు..ఉస్మానియా ఆస్ప్రతి, సిటీ కాలేజీ లాంటివి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని, మూసీ ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా నగరం ఒక టూరిస్టు స్పాట్‌గా మరింత పేరును సంపాదిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News