Thursday, January 23, 2025

ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ వైద్యుడు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు ఆదిత్య రెడ్డి ఎన్ సిబి అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 22మందిని ఎన్ సిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 22 మందిలో హైదరాబాద్ కు చెందిన సైకియాట్రిస్ట్ ఆదిత్య రెడ్డి ఉన్నాడు. మానసిక రోగులపై ఆదిత్య రెడ్డి డ్రగ్స్ ప్రయోగిస్తున్నాడు. ఎల్ఎస్ డీ, ఎండిఎంఏలకు ఆదిత్య రెడ్డి బానిసగా మారాడు. ఆదిత్య రెడ్డి ఓన్లీ లవ్ పేరుతో డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నాడు. ఆదిత్య రెడ్డి చర్యలపై  ఎన్ సిబి అధికారులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad doctor arrest in Dehli Drugs Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News