Monday, December 23, 2024

సైబర్ మోసం…రూ. 8.5 కోట్లు నష్టపోయిన వైద్యుడు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ వైద్యుడు సైబర్ క్రిమినల్స్ బారిన పడి రూ. 8.6 కోట్లు పోగొట్టుకున్నాడు. అయితే తెలంగాణలో అతిపెద్ద సైబర్ మోసం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టిజిసిఎస్బి)కి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.

వైద్యుడు మే 21న ఫేస్ బుక్ లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ప్రకటన చూశాడు. తర్వాత తన వివరాలు నింపాడు. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు అతడిని సంప్రదించి వైద్యుడి ఫోన్ నంబర్ ను నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. వారి వలలో పడిన డాక్టర్ వారి యాప్ లింకులకు డబ్బు పంపాడు. మొదట్లో వైద్యుడు లాభాలను ఉపసంహరించుకున్నాడు. దాంతో నమ్మకం కుదిరాక విడతల వారీగా రూ. 8.6 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత లాభాలను ఉపసంహరించడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. లాభాల్లో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఉపసంహరించుకునే వీలుందని అనడంతో షాక్ తిన్నాడు. కస్టమర్ కేర్ ను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. మోసపోయానని గ్రహించాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సులభంగా డబ్బు సంపాదించొచ్చనో, కమిషన్ కు ఆశపడో తమ బ్యాంకు ఖాతాలను సైబర్ క్రిమినల్స్ కు అప్పగించే వారిని ‘మనీ మ్యూల్స్’ గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ వైద్యుడు మొత్తంగా 63 విడతల్లో బదిలీ చేసిన నగదులో కొంత భాగం కరీంనగర్ వీణవంక బ్యాంకుకు చేరగా, మిగతా మొత్తం విశాఖపట్నం, కడప, ముంబై, ఢిల్లీ, థానే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇండోర్, లుధియానతో పాటు హరియాణలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News