రెండు నెలల్లో హైదరాబాద్ డ్రగ్స్ రహిత నగరం కావాలి
గంజాయి మాట వినిపించొద్దు
పబ్బులు, విద్యాసంస్థలపై గట్టి
నిఘా డ్రగ్స్‌తో ఎంతటివాళ్లు
పట్టుబడ్డా కఠిన చర్యలు
పైరవీలు చేస్తే ఉపేక్షించేదిలేదు
ట్రాఫిక్ జామ్‌లు కాకుండా
సిబ్బంది మోహరింపు కొత్వాల్
శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశం
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని హైదరాబాద్ పోలీస్ క మిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఐసిసిసిలోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నగర పోలీసు అధికారులతో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. స మావేశంలో డిసిపిలు, ఎడిసిపిలు, ఎసిపిలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థలు, పబ్బులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. పబ్బుల్లో డ్రగ్స్ విక్రయా లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో డ్రగ్స్ మాట వినిపించవద్దని, డ్రగ్స్ తీసుకునేవారు, విక్రయించేవారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
ఎంతటి వారైనా డ్రగ్స్ విషయంలో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గంజాయి అనే మాట వి నిపించవద్దని, విక్రయించేవారు, రవాణా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఎక్కడ విక్రయించకుండా, తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా యువత గం జాయి బారినపడుతున్నారని, విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిపారు. విద్యాసంస్థలు, ఇంటర్నేషనల్ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
పైరవీలు చేస్తే కఠిన చర్యలు…
తన పేరు చెప్పి ఎవరైనా పైరవీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించమని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ జాం కాకుండా సిబ్బందిని మోహరించాలని, పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.