Friday, November 22, 2024

రేపటి నుంచే ‘ నుమాయిస్ ’(ఎగ్జిబిషన్)

- Advertisement -
- Advertisement -

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 15 రోజుల పాటు నిర్వహణ
ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్, మంత్రి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : జనవరి 1 నుండి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రిీయల్ ఎగ్జిబిషన్ ( నుమాయిష్- 2024) ప్రారంభమవుతుందని నుమాయిష్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాయిష్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.  ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 8 దశాబ్దాలుగా తెలంగాణకు నుమాయిష్ ఓ ప్రైడ్ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నో రాష్ట్రాల నుండి విజిటర్స్ గతం నుంచి వస్తున్నారని..నిజాం కాలం నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉందన్నారు.

సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పని చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. తనను సొసైటీ ప్రెసిడెంట్‌గా ఎంచుకోవడం పట్ల తనకు సంతోషంగా ఉందన్నారు. మొత్తంగా నుమాయిష్ పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా ఫైర్, హెల్త్, అంబులెన్స్ ఇలా తదితర విషయాల్లో జాగ్రత్తలు సొసైటీ చూస్తోందన్నారు. నుమాయిష్ జరిగే ఈ 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందిర్శిస్తారన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదిక అన్నారు.

ఈ సారి 2,400 పై చిలుకు ఎగ్జిబిటర్లు రానున్నారన్నారు. ఇలా ఎంతో మంది ఇక్కడికి వచ్చే వ్యాపారం చేస్తున్నారని, వారికి ప్రొత్సహం సొసైటీ అందిస్తుందని చెప్పారు. ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యా సంస్థలు నడుస్తున్నాయని.. తద్వారా 30 వేల మంది మహిళలకు విద్య అందుతుందన్నారు. వాణిజ్యవ్యాపారంలో ఈ నుమాయిష్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఇంకా నుమాయిష్‌లో తొలి సారిగా శాకాహారం రెస్టారెంట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని యోచిస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. నుమాయిష్‌ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News