Thursday, January 23, 2025

ప్రియుడు లేడని ప్రియురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడు లేని జీవితం వృధా అనుకొని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  పంజాబ్‌కు చెందిన నేహా(19) అనే యువతి నానక్‌రాంగూడలోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్‌గా పని చేస్తూ గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో హాస్టల్‌లో ఉంటుంది. బాలాపూర్‌కు చెందిన సల్మాన్ అనే యువకుడు ఆరు నెలల క్రితం అదే బేకరీలో పని చేస్తుండడంతో ఇద్దరు మధ్య పరిచయం పెరగడంతో ప్రేమగా మారింది.

Also Read: వికృత మేళాగా మిగిలిన కుంభమేళా!

ఈ విషయం బేకరీ యజమానికి తెలియడంతో సల్మాన్ ఉద్యోగం నుంచి తొలగించాడు. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సల్మాన్ ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వ్యతిరేకించారు. దీంతో తన ప్రేమ పెళ్లి జరగదని మనోవేదనకు గురయ్యాడు. అక్టోబర్ 1న సల్మాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ప్రియురాలు మానసికంగా కుంగిపోయింది. ప్రియుడి లేని జీవితం వ్యర్థం అనుకొని తన హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుంది. హాస్టల్ నిర్వహకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News