Wednesday, January 22, 2025

గచ్చిబౌలిలో యువతిని కత్తితో పొడిచి చంపి… కరెంట్ తీగలను పట్టుకున్న ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండాల్లో ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి చెందింది. కనకమామిడిలో ప్రేమోన్మాది ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రేమ పేరుతో గత కొంత కాలంగా బెంగాల్ యువతిని కర్నాటకకు చెందిన రాకేశ్ వేధిస్తున్నాడు. గోపన్‌పల్లి తండాలో ఉంటూ నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా యువతి పని చేస్తుంది. మాదాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న యువతిని రాకేశ్ వేధింపులకు గురి చేస్తున్నాడు. గతంలో పని చేసిన చోట యువతికి యువకుడు పరిచయమయ్యాడు.

ఏడాదిగా యువకుడికి యువతి దూరంగా ఉంటుంది. గత రాత్రి గోపన్‌పల్లి తండాలో యువతి ఇంటికి వెళ్లి ఆమెపై రాకేశ్ కత్తితో దాడి చేశాడు. యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆమెపై రాకేశ్ కత్తితో దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే చనిపోయింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు స్నేహితులపై కూడా అతడు దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ముగ్గురు స్నేహితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి రాకేశ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విద్యుదాఘాతంలో గాయపడిన రాకేశ్‌ను కనకమామిడిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేశ్ కర్నాటకలోని బీదర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News