Monday, December 23, 2024

సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని… సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై డైరెక్టర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పుప్పాలగూడలో ఓ కంపెనీలో యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మ పరిచయమయ్యాడు. సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని ఆమెకు పలుమార్లు మాయమాటలు చెప్పాడు. దీంతో ఒక రోజు డిన్నర్‌కు తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. బుధవారం సదరు యువతి సిద్ధార్థ్ ఇంటికి వెళ్లింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అతడు పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో యువతి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు సిద్ధార్థ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News