Sunday, November 17, 2024

స్వాతంత్య్ర వేడుకలకు నగరం ముస్తాబు

- Advertisement -
- Advertisement -
Hyderabad gears up for the 75th Independence Day
విద్యుత్ దీపాలతో కార్యాలయాలు ధగధగ

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరం ముస్తాబైంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మొదలు, బస్తీలు, కాలనీలు, విద్యాసంస్థలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల కార్యాలయాలన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్వాతంత్రం సిద్దించి 75 వసంతాలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల పేరుతో గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున వ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చార్రితక కట్టడాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యుత్ దీపాల ప్రత్యేకంగా అలకరించడంతో నగరం దగదగ మెరిసిపోతోంది. గత ఏడాది కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకులను నిరాడంబరంగా జరపుకోగా, ఈ ఏడాది మాత్రం పెద్ద ఎత్తున జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు వేదికైన గోల్కొండ కోటలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నగరంలోని జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం, జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8 గంటలలోపు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలోజాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడానున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కోట చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు కోట లోపల 2 వేల పైగా సిబ్బందితో భద్రతా వలయం ఏర్పాటు చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించిన పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

రామ్ దేవ్ గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిని ఈ 5 గంటల పాటు మూసి వేయనున్నారు. అయితే వేడుకల్లో పాల్గొనేందుకు పాసులున్న వాహనాలను మాత్రం సింగిల్ రోడ్డు ద్వారా అనుమతించున్నారు. అది కూడా ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రమే ఆ మార్గం గుండా లోపలికి అనుమతించనున్నారు. ఆ తర్వాత వేడుకలు ముగిసివరకు పూర్తిగా మూసి వేసి అనంతరం అక్కడి నుంచి బయటి వెళ్లేందుకు మాత్రమే అనుమతించనున్నారు. అదేవిధంగా వేడుకల్లో పాల్గొనున్న వివిఐపి, విఐపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాసులను జారీ చేశారు. వీరి వాహనాలను మాత్రమే కోటలోకి అనుమతించనున్న పోలీసులు మిగిలిన పాస్‌లు గల వాహనాలకు కోట బయటే వేర్వేరు ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసు ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News