Thursday, January 23, 2025

బెంగళూరులో హైదరాబాద్ యువతిని చంపి…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియురాలిని చంపి ప్రియుడు పారిపోయిన సంఘటన కర్నాటక రాజధాని బెంగళూరులోని కొడిహళ్లి ప్రాంతంలో జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. హైదరాబాద్‌కు చెందిన అకాంక్ష బిద్యాసర్ అనే యువతి(23) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఢిల్లీకి చెంది అర్పిత్ అనే యువకుడు ఆన్‌లైన్ లెర్నింగ్ అప్లికేషన్ హైదరాబాద్‌లో నేర్చుకొని బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అర్పిత్, అకాంక్షకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు మధ్య పరిచయం ఉండడంతో బెంగళూరు వెళ్లిన తరువాత రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అకాంక్ష మరో కంపెనీలో జాబ్ చేస్తుండగా అర్పిత్ హైదరాబాద్‌కు మారాడు. ఇద్దరు మధ్య దూరం పెరిగింది. దీంతో ఇద్దరు మధ్య ఉన్న బంధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read: హాస్టల్‌లో యువతి మృతదేహం నగ్నంగా… సెక్యూరిటీ గార్డు ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య

సోమవారం అకాంక్ష ఉన్న రూమ్‌కు అర్పిత్ వెళ్లాడు. సిసి టివి ఫూటేజీ వివరాల ప్రకారం… 3.10 నిమిషాలు ఇద్దరు ఫ్లాట్‌కు వచ్చారు. అర్పిత్ 4.50 నిమిషాలకు బయటకు వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు. 15 నిమిషాల తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అకాంక్ష రూమెంట్ నవనీతా ఫ్లాట్‌కు వచ్చేసరికి లాక్ వేయడంతో తన దగ్గర ఉన్న మరో కీతో లాక్ ఓపెన్ చేసి చూడగా అకాంక్ష మృతదేహం ఫ్లోర్‌పై కనిపించింది. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు బ్లాంకెట్ వేలాడదీసి ఉంది. ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.   అనంతరం అర్పిత్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి అతడి బ్యాగ్, మొబైల్ ఫోన్, వాలెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అర్పిత్ పని చేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. బెంగళూరు వెళ్తున్నానని చెప్పి సోమవారం సెలవు తీసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని సర్ సివి రామన్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అర్పిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అతడు దొరికితే నిజాలు బయటకు వస్తాయని కమిషనర్ బీమాశంకర్ గులేడ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News