Sunday, December 22, 2024

లండన్‌లో తెలంగాణ యువతి హత్య

- Advertisement -
- Advertisement -

లండన్ : తెలంగాణకు చెందిన 27 ఏండ్ల యువతి కొంతం తేజస్విని ని లండన్‌లోని ఫ్లాట్‌లో కత్తితో పొడవడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కే చెందిన బ్రెజిల్ వ్యక్తి ఒకరు ఆమెను హత్య చేసినట్లు వెల్లడైంది. లండన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తేజస్విని ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీల్డ్ క్రెసెంట్‌లో జరిగిన ఈ ఘటనలో తేజస్విని కత్తిపోట్లకు గురై అక్కడికిక్కడే మృతి చెందగా 28 సంవత్సరాల మరో మహిళ తీవ్రంగా గాయపడింది, ఆమెను చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిసింది. జరిగిన దారుణం గురించి తేజస్విని సమీప బంధువు విజయ తెలియచేశారు. తేజస్విని తన స్నేహితులతో కలిసి ఉండే అపార్ట్‌మెంట్‌లోకి బ్రెజిల్‌కు చెందిన ఆగంతకుడు వారం రోజుల క్రితం కూడా వెళ్లాడని ఇప్పుడు నిర్థారించారు.

తేజిస్విని గత ఏడాది మార్చిలో ఇక్కడకి మాస్టర్స్ డిగ్రీ విద్యాభ్యాసానికి వచ్చింది. ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న దశలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఓ 24 ఏండ్ల యువకుడిని, 23 ఏండ్ల యువతిని అరెస్టు చేశారు. మగవాడిని కస్టడీలో ఉంచారు. యువతిని తరువాత వదిలిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి ఆ తరువాత మరో 23 ఏండ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన పోలీసులు యువతి హత్య చేసిన వ్యక్తి పేరు కెవెన్ ఆంటోనియో లౌరెన్సోడి మోరియస్ అని పేర్కొంటూ ఫోటో కూడా విడుదల చేశారు. సంబధిత వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే తమకు తెలియచేయాలని కోరారు. ఈ వ్యక్తిని అనుమానం కొద్ది అరెస్టు చేసి నార్త్ లండన్ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలిపిన పోలీసులు , ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నట్లు డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ లిండా బ్రాడ్లే వివరించారు. అంతవరకూ పూర్తి వివరాలు తెలియచేయలేమన్నారు.
తేజస్విని బ్రాహ్మణపల్లి ఊరామె
తేజస్విని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని బ్రాహ్మణపల్లివాసి. మరో రెండు నెలల్లోనే ఆమె మాస్టర్స్ డ్రిగీ పూర్తి అవుతుంది. కాగా తండ్రి అనారోగ్యానికి గురి కాగా ఆరు నెలల క్రితం ఇంటికి వెళ్లి వచ్చింది. ఉన్నత విద్య పూర్తి కానుండటంతో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. ఈ లోగా తమ కూతురు దారుణ హత్యకు గురి అయిందని తెలియడంతో ఆమె ముదుసలి తల్లిదండ్రులు కన్నీరమున్నీరవుతున్నారని సమీప బంధువులు తెలిపారు. ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న బ్రెజిలియన్ ఎందుకు ఈ తెలంగాణ యువతిపై ఎందుకు కక్షకట్టి అంతమొందించాడు? వీరు నివసముంటున్న ఫ్లాట్‌లోకి తన మకాం ఇటీవలే మార్చి ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు అనేది తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News