- Advertisement -
గత పదిపదిహేను రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకుంటే ప్రస్తుతం తులం బంగారం ధర రూ.60వేలకు పైనే ఉంది.
ఇలానే పెరుగుతూ పోతే.. సామాన్య ప్రజలకు బంగారం అందని ద్రాక్షగా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదు. అయితే, కొండెక్కి కూర్చున్న పసిడి, వెండి ధరలు సోమవారం స్వల్పంగా దగ్గాయి. తులం బంగారంపై రూ.10 తగ్గగా.. కిలో వెండిపై రూ.100 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.ఇక, వెండి కిలో ధర రూ.80,400 ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశంలో బంగారం ధరలు:
- దేశా రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,390 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960 ఉంది.
- దేశ ఆర్థక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,460 ఉంది.
- Advertisement -