Monday, December 23, 2024

హైదరాబాద్ నగరం ఇక తెలంగాణ స్వంతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్  నగరానికి ఏపీతో బంధం అధికారికంగా తెగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విభజన సమయంలో హైదరాబాద్ నగరం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ 10 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.  2014,  జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించగా నేటితో ఆ 10 సంవత్సరాల గడువు ముగిసింది. కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇకపై హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగదు.

నేటి నుంచి హైదరాబాద్ నగరం పూర్తిగా తెలంగాణకే సొంతం కానుండటం విశేషం. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపికి కేటాయించిన ఆస్తులన్నింటినీ తెలంగాణకు అప్పగించడం కూడా జరిగింది. కృష్ణా, గోదావరి జలాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. వాటన్నింటికీ త్వరలో పరిష్కారం కనుగొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News