Sunday, January 19, 2025

హైదరాబాద్ గృహ విక్రయాల్లో 28% వృద్ధి

- Advertisement -
- Advertisement -

2011 తర్వాత ఇదే అత్యధికం: నైట్ ఫ్రాంక్ ఇండియా

మన తెలంగాణ/ హైదరాబాద్ : గత సంవత్సరంలో(2022) హైదరాబాద్‌లో గృహాల విక్రయాలు 28 శాతం పెరిగి 31,046 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే 6.7 మిలియన్ చ.అడుగుల ఆఫీసు లీజింగ్‌తో ఆఫీస్ లావాదేవీలలో వార్షికంగా 12 శాతం వృద్ధిని సాధించిందని తన తాజా నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఇది భారతదేశంలోని మొదటి ఎనిమిది మార్కె ట్‌లలో మూడవ అత్యధిక లీజింగ్ పరిమాణం కావడం గమనార్హం. ఈ మార్కెట్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మద్దతు లభించిందింది.

కార్యాలయ నిర్మాణాలు పూర్తి కావడం అనేది వార్షికంగా 146 శాతం పెరిగి 11.2 మిలియన్ చ.అడుగులకి చేరుకుంది. ఇది నగరంలో ఒక దశాబ్దంలో అత్యధికం కావడం గమనార్హం. 2022లో హైదరాబాద్‌లో అందిన మొత్తం ఆఫీస్ స్పేస్ సరఫరాలో 92 శాతం వృద్ధిని నమోదు చేసింది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరుసగా 44 శాతం, 34 శాతం మేర అందించాయి. హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో అద్దెలకు డిమాండ్ పెరగడంతో 2022లో హైదరాబాద్‌లో సగటు లావాదేవీల అద్దెలు 6 శాతం పెరిగాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2022 సంవత్సరంలో 31,046 యూనిట్లతో అమ్మకాల్లో 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2011 నుంచి ఇదే నగరంలో అత్యధిక విక్రయం కావడం గమనార్హం. 2022లో నూతన ఆవిష్కరణలు 43,847 యూనిట్లతో వార్షికంగా 23 శాతం వృద్ధిని చవిచూశాయి.

9 నగరాల్లో 34% పెరిగిన సేల్స్

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల కారణంగా దేశంలో రియల్ ఎస్టేట్ వృద్ధి పథంలో పయనిస్తోంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాసాల విక్రయాలు 34 శాతం పెరిగి తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆస్తి సలహా సంస్థ నైట్ ఫ్రాంక్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంచనాను వెల్లడించింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ మార్కెట్ల ఆధారంగా గత ఆరు నెలల పరిస్థితిపై ఈ నివేదిక రూపొందించారు. దీని ప్రకారం, మొత్తం ఆఫీస్ స్పేస్‌ల డిమాండ్ గతేడాది 36 శాతం పెరిగి 51.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఈ నివేదిక ప్రకారం, ఎనిమిది నగరాల్లో హౌసింగ్ యూనిట్ల అమ్మకాలు గతేడాది 34 శాతం పెరిగి 3,12,666 యూనిట్లకు చేరుకున్నాయి.

గత తొమ్మిదేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 2022 సంవత్సరంలో ఇళ్ల ధరలు పెరిగినా, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినా హౌసింగ్ యూనిట్ల విక్రయాల్లో మాత్రం వృద్ధి ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ తెలిపారు. డేటా ప్రకారం, హౌసింగ్ అమ్మకాలలో ముంబై 85,169 యూనిట్లతో అగ్రస్థానంలో ఉంది. 2021 సంవత్సరంతో పోలిస్తే ముంబైలో 35 శాతం ఎక్కువ సేల్స్ ఉన్నాయి. ఇక ఢిల్లీ-ఎన్‌ఎన్‌సిఆర్‌లో హౌసింగ్ ప్రాపర్టీల డిమాండ్ 67 శాతం పెరిగి 58,460 యూనిట్లకు చేరుకోగా, బెంగళూరులో డిమాండ్ 40 శాతం పెరిగి 53,363 యూనిట్లకు చేరుకుంది. పుణెలో గృహాల విక్రయాలు 17 శాతం పెరిగి 43,410 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో అమ్మకాలు 14,248 యూనిట్లతో 19 శాతం పెరగ్గా, అహ్మదాబాద్‌లో 58 శాతం వృద్ధితో 14,062 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరంలో గృహాల విక్రయాలు క్షీణించిన ఏకైక నగరంగా కోల్‌కతా ఉంది. ఈ నగరం 10 శాతం క్షీణతతో 12,909 యూనిట్ల వద్ద నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News