వరంగల్ నిట్‌కు 23వ ర్యాంకు
దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో హైదరాబాద్ ఐఐటి మినహా రాష్ట్రానికి చెందిన మిగతా విద్యాసంస్థలు టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ విద్యాసంస్థల ర్యాంకుల్లో ఇంజనీరిం గ్ విభాగంలో హైదరాబాద్ ఐఐటీ 8వ స్థానం దక్కించుకుంది. తర్వాత వరంగ ల్ నిట్ 23వ ర్యాంక్ పొందగలిగింది. ఆ తర్వాత హైదరాబాద్ ట్రిపుల్ ఐటి 54వ స్థానంలో, జెఎన్‌టియుహెచ్ 62వ స్థానం పొందాయి. యూనివర్సిటీల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 6వ స్థానంలో నిలవగా, ఉ స్మానియా యూనివర్సిటీ 32వ స్థానంలో నిలిచింది. అలాగే హైదరాబాద్ ట్రిపు ల్ ఐటి 83వ స్థానం దక్కించుకుంది. పరిశోధనల విభాగంలో హైదరాబాద్ ఐ ఐటి 15వ స్థానంలో నిలవగా, హైదరాబాద్ యూనివర్సిటీ 25వ స్థానంలో నిలిచింది. మేనేజ్‌మెంట్ విభాగంలో హైదరాబాద్ ఐసిఎఫ్‌ఎఐ 27వ ర్యాంకు లో నిలిస్తే, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కాలేజీ 61వ స్థానంలో నిలిచాయి. ఫా ర్మసీ విభాగంలో హైదరాబాద్ ఎన్‌ఐపిఇఆర్ 6వ ర్యాంకులో నిలిచింది. న్యాయ విభాగంలో హైదరాబాద్‌లోని నల్సార్ వర్సిటీకి 3వ ర్యాంక్ దక్కింది.