Friday, November 22, 2024

రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’.. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః స్వాంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో మంగళవారం నిర్వహించనున్న ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. కార్యక్రమానిని వివిఐపిలు, విఐపిలు పెద్ద ఎత్తున రానుండడంతో రాజీవ్ గాంధీ స్టాట్యూ, సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ జంక్షన్, రాజ్‌భవన్ రెండు వైపుల రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలనిన కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎంపిలు గేట్ నంబర్ 1 ద్వారా రాజ్‌భవన్‌లోని వెళ్లి కార్యక్రమం పూర్తయిన తర్వాత గేట్ నంబర్ 2 ద్వారా బయటికి రావాలి. రాజ్‌భవన్‌లోపల వారికి కేటాయించిన పార్కింగ్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి. పింక్ కారు పాస్ ఉన్న వారు గేట్ నంబర్ 3 ద్వారా లోపలికి వెళ్లి రాజ్‌భవన్ లోపల వారికి కేటాయించిన ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేయాలి.అదే గేట్ ద్వారా బయటికి రావాలి.
వైట్ కారు పాస్ ఉన్న వారు గేట్ నంబర్ 3 ద్వారా రాజ్‌భవన్‌లోపలికి వెళ్లాలి. వాహనాలను ఎంఎంటిఎస్ పార్కింగ్ లాట్, పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వైపు ఒక వరుసలో, లేక్‌వ్యూ నుంచి వివి స్టాట్యూ జంక్షన్ ఎదురుగా సింగిల్ లేన్‌లో వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News