Thursday, January 23, 2025

వైద్యరంగంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: తెలంగాణ సర్కార్ కృషి తో హైదరాబాద్ మహానగరం వైద్యరంగంలో దేశానికే ఆదర్శంగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అవిశ్రాంత కృషి ఫలితంగా నిరుపేదలకుసైతం పైసా ఖ ర్చు లేకుండానే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని పేరొందిన ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో నగరవాసులే కాకుండా వివిధ వ్యాధులతో బాధపడుతున్న పేదలు చికిత్స నిమిత్తం మ న రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ ఆసుపత్రులకు వచ్చి చికిత్స చేసుకుంటారు. వైద్యం కోసం ఈ మహానగరానికీ వచ్చే రోగులు, వారి బంధువు లు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా బసతో పాటు తిండి వసతిని సైతం కల్పించడం ద్వారా వారికి అండగా నిలుస్తోంది.

నిరుపేదల వైద్య దేవాలయాలైన గాంధీ, ఉస్మానియా, అతితర ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులల్లో వైద్య సేవలను పూర్తిగా మెరుగుపర్చడమే కాకుండా నగరంలో ని నిరుపేదలతోపాటు రాష్ట్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయి లో వైద్య చికిత్సను అందించాలన్నదే లక్షంగా నగరం నలుమూలాల తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సై న్సెస్ (టిమ్స్) పేరుతో ఆసుపత్రులను నిర్మిస్తోంది. ఇందులో కొవిడ్-19 మొదటివేవ్ సమయంలో గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియానికి ఆనుకుని ఉన్న 15 -అంతస్థుల స్పోర్ట్ హాస్టల్ భవనాన్ని ప్రభు త్వం మొదటిటిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. అదేవిధంగా అల్వాల్, ఎల్‌బినగర్,సనత్‌నగర్‌లలో రూ. 2,679. కోట్ల వ్యయంతో 1000 పడకల చొప్పున కొ త్తగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదగ శంకుస్థాపన జరగగా ఆసుపత్రుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్-స్పెషాలిటీ సేవలతోపాటు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో టిమ్స్‌లో స్పెషాలిటీ, సూపర్ స్పె షాలిటీ కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులలో వైద్య విద్యను సైతం అందించనున్నారు. అంతేకాకుండా నగరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింతగా చేరువ చేయడానికి జి హెచ్ ఎం సిలో ఉన్న ఆరు జోనల్ కార్యాలయ పరిధిలోకి ఒక్కొక్క జోన్ కు ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డిఎం అండ్ హెచ్‌ఒ) అధికారి కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రోగి బంధువులకు నైట్‌షెల్టర్లతో పాటు రూ.5ల మూడు పూటల భోజన వసతి
ముఖ్యమంత్రి కెసిఅర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రధాన ఆసుపత్రు ల్లో చికిత్స పొందుతున్న రోగి బంధువుల కోసం సైతం ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మహానగరంలో రోగికి సహాయకులుగా వచ్చిన వారు ఆకలితో అలమటిస్తూ, రాత్రి వేళా పడుకునేందుకు సరైన స్థలం లేకండా చెట్ల కింద తలదాచుకునే వారు. దీంతో రోగి బంధువుల అవస్థలను గమనించిన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా వారు ప్రశాంతంగా కునుకు తీసేందుకు ఏర్పాటు చేసింది.

ఇందుకు రూ.10.68 కోట్ల వ్యయంతో 7 ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్లు భవనాలు అందుబాటులో తీసుకువచ్చారు. ఈ నైట్ షెల్టర్లలో ప్రతి రాత్రి సుమారు 900 మందికి వసతిని పొందుతున్నారు. అంతేకాకుండా వారి ఆకలిని తీ ర్చేందుకు భోజన వసతి కల్పించింది. ఇందుకు హరే రా మ హరే కృష్ణకు చెందిన అక్షయ పాత్ర ద్వారా రోగుల బందువులకు పూటకు రూ.5ల చొప్పున నగరంలోనీ 15 ప్రధాన ఆసుపత్రుల్లో మూడు పూటలు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్‌ను రూ.5లకే అందిస్తోంది. ఇప్పటి వరకు 17లక్షల 52 వేల మంది లబ్ధిపొందారు..
286 బస్తీ దవాఖానాలు
నగరంలోని నిరుపేదలకు స్థానికంగా వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాల కు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా కార్పొరేట్ తరహా వైద్య సేవలను అందించడమే కాకుండా వైద్య పరీక్షలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో వార్డుకు 2చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పా టు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 286 బస్తీ దవాఖానలను అందుబాటులోకి రాగా మరో 8బస్తీ దవాఖానాలు చివరిదశకు చేరుకున్నాయి.

ఈ బస్తీ దవాఖానాల ద్వారా ఫిబ్రవరి 2023 నాటకి గ్రేటర్ వ్యా ప్తంగా 1 కోటి 70 లక్షల 44 వేల 671మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించారు.
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా నేడు తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం గర్భిణి స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్‌లను అందించనుంది. గర్భిణీలలో బలహీనతను అరికట్టడానికి, పోషకాహారా న్ని మెరుగు పర్చడంకోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ ను పంపిణీ చేయనున్నారు.

జిహెచ్ ఎంసి పరిధిలోని మొత్తం 75 సెంటర్ల ద్వారా 4400 మంది గర్భిణీ స్త్రీలకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఉ న్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రెండవ, మూడవ చెక్ అప్ చేసుకున్న గర్భిణులకు ఉచితంగా కిట్‌లను పంపిణీ చేస్తారు. పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు హర్లిక్స్, ఐరన్ సిరప్, ఖర్జూర, నెయ్యి, పల్లి చిక్కి, ఒక కప్పు, బాస్కెట్ కూడా పంపిణీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News