Tuesday, September 17, 2024

నిర్మానుశ్యమైన హైదరాబాద్‌ను ఎప్పుడు ఎవరూ చూసి ఉండరు (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఉంటేనే క్షేమం
భయటకువస్తే కరోనా కాటువేస్తుంది
రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లలో ఉంటే హైదరాబాద్ ఎలా ఉందో డ్రోన్‌లతో తీసిన వీడియోను రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నది. ప్రజలు ఇళ్లలో ఉంటే హైదరాబాద్ ఎలా ఉంటుందో నెటిజన్లు వీడియోలో చూస్తూ స్నేహితులకు ట్యాగ్ చేస్తున్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, చారిత్రాత్మకమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంకేతిక అంశాలకు కేంద్రం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పట్టణంమంతా నిర్మానుష్యంగా మారింది. శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ చార్మినార్, నిత్యం బిజిగా ఉండే హైటెక్ సిటీ, ట్రాఫిక్‌తో తల్లడిల్లే రోడ్లు నిర్మాను ష్యంగా మారాయి. ఇలాంటి హైదరాబాద్‌ను ఎప్పుడూ, ఎవరూ చూసి ఉండరు. జనమంతా ఇళ్లలోనే ఉండి రవాణా, వ్యాపారం, పర్యాటక కార్యకలాపాలు స్తంభించిపోతే హైదరాబాద్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఎంపి సంతోష్‌కుమార్ పోస్టు చేశారు. అయితే ప్రస్తుతం కరోనాను తరిమివేసేందకు లాక్‌డౌన్ సరైన ఆయుధమని ప్రస్తుత నేపథ్యంలో ఇలా ఉంటేనే కరోనాను తరిమివేయవచ్చని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇంటి నుంచి బయటకు వస్తే ప్రమాదం

ఇంటి నుంచి భయటకు వచ్చి కరోనాకు ప్రాణాలను బలి కావవద్దనే సందేశంతో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ పోస్టు చేసిన వీడియో ఆలోచనాత్మకంగా ఉంది. ఇళ్లలో ఉంటే క్షేమంగా ఉంటారని భయటకు వస్తే ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాపించి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సృజనాత్మకంగా ఆలోచించి ఇంట్లో ఉండటమే ఉత్తమమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇళ్లలో ఉండాలని, స్వీయ నిర్భందం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Hyderabad is deserted area with Corona effect

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News