Wednesday, January 22, 2025

సింగపూర్, మలేషియాతో హైదరాబాద్ పోటీ పడాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్ అద్భుతమైన నగరమని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ కేంద్రమని ప్రశంసించారు. రాయదుర్గంలోని మైహోమ్ ట్విట్జాలో కోలియర్స్, ష్యురిపై కంపెనీ కార్యాలయాలను కెటిఆర్, జగదీశ్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయని, సింగపూర్, మలేషియాతో హైదరాబాద్ పోటీ పడాలని సూచించారు. టైర్-2 సిటీలో కూడా ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

కోలియర్స్ కంపెనీ కూడా టైర్-2 సిటీలో ఏర్పాటు దృష్టి పెట్టాలన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్నామని, టిఎస్ ఐపాస్‌తో సులభంగా అనుమతులు వస్తున్నాయని, తెలంగాణలో కరెంట్, నీళ్లు, భూమి, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం 14 రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, అమెరికా ఎఫ్‌డిఎ అనుమతించిన అత్యధిక కంపెనీలున్న రెండోవ రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ కొనియాడారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News