Wednesday, January 22, 2025

జిడిపి వృద్ధిలో హైదరాబాద్ నెం.1

- Advertisement -
- Advertisement -

దేశంలోనే మొదటి స్థానం
ప్రపంచ నగరాల్లో రెండో స్థానం
గుజరాత్, యుపికి దక్కని చోటు

ఫలిస్తున్న సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కృషితో
హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి కంపెనీలు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత జిడిపి వృద్ధి సాధించిన నగరాల్లో దేశంలోనే టాప్-1గా హైదరాబాద్ నిలిచింది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ప్రొజెక్షన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్-10 నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అత్యధిక జిడిపి వృద్ధి సాధించిన టాప్-10 నగరాల్లో (2022) ఇండియాకు చెందిన నగరాలు ఆరు ఉండగా అందులో తెలంగాణలో టాప్‌లో నిలిచింది. ఇండియాలోని మిగతా నగరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అధిగమించ లేకపోయాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

గుజరాత్ అడ్రస్ గల్లంతు

ర్యాంకుల జాబితాలో నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్ లేకపోవడం ఆయనకు చెంపపెట్టు అని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఉద్యమ నాయకుడు, తెలంగాణ సిఎం కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి ఇది సజీవ సాక్షమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జాబితాలో మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ అడ్రస్ గల్లంతైతే, యోగి ఉత్తరప్రదేశ్ ఊసే లేకపోవడం వారి పాలనకు నిదర్శంగా నిపుణులు సెటైర్లు వేస్తున్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న ఆర్థికవిధానాలు, ఐటి మంత్రి కెటిఆర్ కృషితోనే నగరానికి రోజుకొక విదేశీ కంపెనీలు రావటం, పెట్టుబడులు పెరగడంతో హైదరాబాద్ అభివృద్ధిలో ప్రపంచంలోనే నెంబర్ 2 స్థానంలో నిలిచిందని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. టాప్ 10 నగరాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టాప్-10 నగరాల జాబితా ఇలా…

1. హోచి మిన్ (వియత్నాం), 2. హైదరాబాద్ (ఇండియా, -తెలంగాణ), 3. బెంగళూరు (ఇండియా), 4. ఢిల్లీ (ఇండియా), 5. జకార్తా (ఇండోనేషియా), 6. ముంబై (ఇండియా), 7. కౌలాలంపూర్ (మలేషియా), 8. బ్యాంకాక్ (థాయిలాండ్), 9. చెన్నై (ఇండియా), 10. కోల్‌కతా (ఇండియా)లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News