Monday, December 23, 2024

‘ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ’గా హైదరాబాద్‌కు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Hyderabad is recognized as the 'Tree Cities of the World'

హైదరాబాద్ : విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది.“ ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ”గా ఆర్బర్ డే ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఒ) సంస్థలు సంయుక్తంగా ఈ బిరుదును ప్రకటించాయని ప్రభుత్వ సీనియర్ అధికారి మంగళవారం ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో దాదాపు 3,50,56,635 మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాలతో పచ్చదనం పెంపొందించడంలో ఉత్తమ ఫలితాలు సాధించిన హైదరాబాద్ నగరానికి వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ ప్రఖ్యాతి దక్కడం గర్వకారణంగా ఉందని అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితమే ఈ గుర్తింపు అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ప్రశంసించారు. ఇలా గుర్తింపు పొందిన తొలి భారతీయ నగరం హైదరబాద్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News