తార్నాక: హైద్రాబాద్ దేశ రెండవ రాజదానిగా ఏర్పడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేంద్రమే నిదులు గుంజుకుంటుందని అనే అంశము అపోహా మాత్రమేనని దక్షిణ భారత సమితి కన్వీనర్ ప్రొ.డా.గాలి వినోద్‌కుమార్ కాంగ్రెస్ నాయకడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.ఈ సందర్బంగా ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు పరిపాలన విభజన ప్రజల సమగ్ర అభివృద్ది లక్షంగా అంబేద్కర్ ఉత్తరాదిని పెద్ద రాష్ట్రాలుగా,దక్షిణాదిని చిన్న రాష్ట్రాలుగా విభజించడానికి వ్యతిరేకించారని అన్నారు.
డిల్లీ ఉత్తరాది రాజదానిగా,హైద్రాబాద్ దక్షిణాది ప్రాంతప్రజల రాజదానిగా ఏర్పాటు చేయాలని 1955లోనే విభజన కమీషన్ జస్టిస్ ఫజల్ అలీకి తెలిపారన్నారు.రెండు కోట్ల జనాబాతో రాష్ట్రము ఏర్పడాలని,అందరికి సమన్వయము జరగాలంటే దక్షిణాదికి ప్రత్యేక అభివృద్ది మండలితో పాటు రాజదాని ఉండాలన్నారు.అంతే కాకుండా సుప్రీంకోర్టు బెంచ్ ఇండస్ట్రీయల్ కారిడార్ నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తదితర అంశాలను చర్చించడం జరిగిందన్నారు.దేశ రక్షణ రిత్యా హైద్రాబాద్‌లో సముద్రం లేని కారణంగా శత్రు దేశాలకు సుదురంగా ఉన్న కారణంగా వాతవరణ పరంగా సమతుల్యత కలిగిన ప్రాంతం హైద్రాబాద్ అని అన్నారు.డిల్లీ రాష్ట్రము అప్పులు ఎందుకు చేయడం లేదంటే కేంద్రము దక్షిణాదిలోని నైదు ముఖ్య నగరాలకు ఎంత డబ్బు కేటాయిస్తున్నారో కేవలం డిల్లీకి అంతే కేటాయిస్తుందని హైద్రాబాద్ రెండవ రాజదాని అయితే డిల్లీ కంటే త్వరగా అభివృద్ది చెంది ప్రపంచలో పేరు సంపాదించు కుంటుందని అన్నారు.