Monday, December 23, 2024

దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు
విజన్ ఉన్న నాయకుడు కెసిఆర్
రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ జూబ్లీవేడుకల్లో
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ హైదరాబాద్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. విజన్ ఉన్న సిఎం కెసిఆర్‌వల్లే నేడు అత్యంత సురక్షితమైన సిటీగా హైదరాబాద్‌కు పేరు గాంచిందన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ జూబ్లీవేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ ఎస్‌ఆర్‌డిపి కింద హైదరాబాద్‌లో 36 ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి వేముల పేర్కొన్నారు. కెసిఆర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రూరల్ ఎకానమీని గణనీయంగా పెంచారని, దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోందని ఆయన తెలిపారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.1.24లక్షలు ఉంటే 2023లో రూ.3.12 లక్షలు అయ్యిందన్నారు.
శతాబ్ధి కాలంలో జరగని అభివృది ఈ దశాబ్ధి కాలంలోనే..
శతాబ్ధి కాలంలో జరగని అభివృద్ధి కెసిఆర్ నాయకత్వంలో ఈ దశాబ్ధి కాలంలో జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకువెళ్లి, దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తుందన్నారు. 2013,-14లో తెలంగాణ జిఎస్‌డిపి రూ.- 4,51,580 కోట్లు ఉంటే 2022-,23 నాటికి -అది రూ.13.27 లక్షల కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఇది 15.6 శాతం అధిక వృద్ధి సాధించిందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. జీడిపిలో తెలంగాణ వాటా 2014-15లో 4.1 శాతంగా ఉంటే, నేడు అది 4.9 శాతానికి పెరిగిందన్నారు. దేశ అభివృద్ధి కోసం తెలంగాణ అందిస్తున్న జిడిపి వాటా -4.9 శాతమని మంత్రి తెలిపారు. 2014-,15లో దేశ తలసరి ఆదాయం- రూ.86,647గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం -రూ.1,24,104 కోట్లుగా నమోదయ్యిందన్నారు. 2022,-23లో దేశ తలసరి ఆదాయం- రూ.1,72,000 పెరగ్గా, తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా రూ.3,12,115లకు పెరిగిందన్నారు. 9 ఏళ్లలో దేశ తలసరి ఆదాయ వృద్ధి 98 శాతం అయితే, తెలంగాణది 156 శాతమని ఆయన తెలిపారు.
11 విడతల్లో రైతులకు రూ.72,800 కోట్ల పంట పెట్టుబడి
ఒక్క 2022-,23లోనే తెలంగాణ తలసరి ఆదాయం రూ.41వేలు పెరిగిందని, తెలంగాణ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ అని ఆయన పేర్కొన్నారు. 2014 లో మొత్తం పంట సాగు విస్తీర్ణం 1,43,49,186 ఎకరాలు కాగా, 2022, -23 లో మొత్తం పంట సాగు విస్తీర్ణం.2,08,72,978 ఎకరాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రైతుబంధు ద్వారా 2018 నుంచి 2023 నాటికి 11 విడతల్లో 65 వేల మంది రైతులకు రూ.72,800 కోట్లు పంట పెట్టుబడి సాయంగా అందజేసిందన్నారు. రెండు దఫాల్లో 72 లక్షల మంది రైతులకు రూ.36 వేల కోట్ల పంట రుణాన్ని మాఫీ చేసిన దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. ‘వరల్డ్ లార్జెస్ట్ మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’ ఏదీ అని గూగుల్‌లో సెర్చ్ చేయాలని మంత్రి కోరగా ఢిల్లీకి చెందిన బిజినెస్ మెన్ సెర్చ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బదులిచ్చారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారు చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News