Monday, December 23, 2024

హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని ఎప్పుడో భావించారని, దానిని సాధించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని అంబేద్కర్ ఏనాడో రాశాడని తన వ్యక్తిగత అభిప్రాయంకూడా అదేనన్నారు.

రెండో రాజధానికి కావల్సిన అర్హతలన్ని హైదరాబాద్ నగరానికి ఉన్నాయని, మౌళిక వసతులు కూడా ఉన్నాయన్నారు. అంబేద్కర్ మనవడుకూ డా ఇటీవల ఇదే విషయాన్ని వెల్లడించారని సాగర్ గుర్తు చేశారు. బంగారు తెలంగాణ ఆకాంక్ష కూడా రెండో రాజధాని ఉపయోగపడు తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, తెలంగాణ రాజకీయాలపై అధ్యక్షుడు, పార్టీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని, క్రీయాశీలక నిర్ణయాలు పార్టీ వెల్లడిస్తుందన్నారు.

పార్టీకి ఏదో జరుగుతుందని అనుకోవడం సరికాదని, దేశంలో బీజేపీకి మంచి స్కోప్ ఉందని విద్యాసాగర్‌రావు అన్నారు. ఫిక్స్ డిపాజిట్ల లాగా దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పేరిట ఉన్నాయని, మిగతా పార్టీల ఓట్లు జా యింట్ అకౌంట్లలో ఉంటాయని, వాటిని విడిపించుకోవాల్సిన సత్తా తమ పార్టీ నాయకులపై ఉందన్నారు. మోడీ గొప్పదనాన్ని పునాదిగా తీసుకుని బీజేపీ ముందుకు సాగాలని సూచించారు. ఆయన పాలనలో భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అన్ని దేశౠలు మోడీ సలహాలు తీసుకుంటున్నాయని వివరించారు. రాజకీయాల్లో తాను క్రీయా శీలకంగా లేనని, తాను సాధారణ బీజేపీ సభ్యుడిని మాత్రమేనని వ్యాఖ్యానించారు.
* నా వ్యాఖ్యలన్ని ఆచరణలోకి…
ఎంపిగా ఎన్నికై 25 సంవత్సరాలు పూర్తయిందన్న విద్యాసాగర్‌రావు తాను గతంలో ఇచ్చిన పిలుపులన్ని కూడా ఆచరణలోకి వచ్చాయ న్నారు. గ్రామ గ్రామానికి గోదావరి జలాలు అన్న నినాదం, కరీంనగర్ టు కశ్మీర్ రైల్వే లైన్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ది నోత్సవంఅధికారికంగా చేపట్టాలన్న పిలుపు నిజమైందన్నారు. పాతికేళ్ల క్రితం తాను ఎంపీగా చేసిన ప్రతిపాదనలు అన్ని ఆచరణలోకి రావడంతో తనకెంతో సంతోషంగా ఉందని విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్ పోరాటాలు బీజేపీ ఎంతో మేలు చేస్తాయన్నారు. కరీంనగర్ కల్లోల జిల్లా కాదు కళకళలాడే జిల్లా అని కూడా తాను ఆరోజే చెప్పానని, జిల్లా అభ్యున్నతి వెనక అన్ని పార్టీల కృషి ఉందని సాగర్ అన్నారు. కరీంనగర్ తనకు జన్మభూమితో పాటు కర్మభూమి కూడా అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News