Wednesday, January 22, 2025

వాణిజ్యపరంగా భాగ్యనగరం టాప్

- Advertisement -
- Advertisement -

షాపింగ్ మాల్స్ లీజులో దేశంలోని టాప్- 8 సిటీల్లో హైదరాబాద్ నెంబర్‌వన్
రెండోస్థానంలో కోల్‌కత్తా, మూడోస్థానంలో ముంబై

Hyderabad Third place among safest cities in India

మనతెలంగాణ/హైదరాబాద్:  వాణిజ్యపరంగా భాగ్యనగరం భారతదేశానికే తలమానికంగా మారింది. షాపింగ్ మాల్స్ (లీజు స్థూల విస్తీర్ణం, గ్రాస్ లీజబుల్ ఏరియా-జీఎల్‌ఎ)లో హైదరాబాద్ దేశంలోని టాప్- 8 సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. గ్రేడ్ -ఎ కేటగిరీలో హైదరాబాద్ ఎంపికయ్యిందని నైట్‌ఫ్రాంక్ తన నివేదికలో వెల్లడించింది. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల జీఎల్‌ఎ కలిగిన షాపింగ్ మాల్స్ ఉన్న నగరాలను గ్రేడ్ -ఎలో చేర్చారు. లక్ష నుంచి లక్షన్నర లోపు జీఎల్‌ఎ కలిగిన సిటీలను గ్రేడ్ -బిలో, లక్ష కన్నా తక్కువ జీఎల్‌ఎ ఉన్న నగరాలను గ్రేడ్-సిలో చేర్చారు.

అయితే హైదరాబాద్‌లో మొత్తం 72 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్స్ ఏరియా అందుబాటులో ఉండగా అందులో 52 శాతం వాటా (39 లక్షల చదరపు అడుగులు) జీఎల్‌ఎ కావడం గమనార్హం. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలలకు సంబంధించిన రిటైల్ రిపోర్టు గురించి నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లోని గ్రేడ్ -బి, గ్రేడ్-సి షాపింగ్ మాల్స్ వరుసగా 21 శాతం (15.7 లక్షల చదరపు అడుగులు), 27 శాతం (20.2 లక్షల చదరపు అడుగుల) విస్తీర్ణంలో ఉన్నాయి.

హైదరాబాద్ తర్వాత కోల్‌కత్తా

గ్రేడ్-ఎలో హైదరాబాద్ తర్వాత స్థానంలో కోల్‌కత్తా (45 శాతం వాటా), ముంబై (43), బెంగళూరు (42), చెన్నె (39), అహ్మదాబాద్(30), పుణె (19 శాతం వాటా)లు కలిగి ఉన్నాయి. ఇండియా మొత్తంమ్మీద ఉన్న 9 కోట్ల 22 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్స్ జీఎల్‌ఎలో 3వ వంతుకు పైగా వాటా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానిదేనని నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తంమ్మీద ఉన్న మాల్స్ స్పేస్ ఏరియాలో 39 శాతాన్ని మాత్రమే గ్రేడ్-ఎలో చేర్చారు.

ఈ ఏడాది ప్రథమార్ధంలో మొత్తం 217 షాపింగ్ మాల్స్‌ను పరిగణనలోకి తీసుకోగా వాటిలోని టాప్-8 సిటీల్లో 52 షాపింగ్ మాల్స్‌కు సంబంధించి 3 కోట్ల 60 లక్షల చదరపు అడుగుల జీఎల్‌ఎ ఉందని నైట్‌ఫ్రాంక్ పేర్కొంది. 2019 డిసెంబర్ ముందు మొత్తం 255 మాల్స్ ఉండగా వాటిలోని 7 కోట్ల 74 లక్షల చదరపు అడుగుల జీఎల్‌ఎ మాత్రమే అందుబాటులో ఉండేదని నైట్‌ఫ్రాంక్ తన నివేదికలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News