Wednesday, July 3, 2024

ఆ స్థలాలు హైదరాబాద్ జర్నలిస్టులకు ఇస్తాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో జర్నలిస్టులకు చేసిందేమీలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఖమ్మంలో టియుడబ్లుజె, ఐజెయు రాష్ట్ర తృతీయ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. నేతలు, జర్నలిస్టులు ఈనాడు అధినేత రామోజీరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. అక్రిడేషన్ కార్డులు మరో మూడు నెలలు పొడిగిస్తున్నామని, హెల్త్‌కార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అతి కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ జర్నలిస్టులకు కేటాయించిన స్థలం ఇస్తామని, ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే పరిష్కరిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.  వారం, పది రోజుల్లోనే హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన జీవో విడుదల చేసేందుకు కాంగ్రెస్  ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే హైదరాబాద్ లో మిగిలిపోయిన మిగతా జర్న లిస్టులకు, జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వర లోనే ఒక పాలసీని తీసుకవస్తామని పొంగులేటి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News