Wednesday, January 22, 2025

నర్సు ప్రాణం తీసిన వాటర్‌హీటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్నానం కోసం వాటర్ హీటర్ పెట్టే క్రమంలో కరెంట్ షాక్ తో నర్సు దుర్మరణం చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సౌమ్య(20) అనే యువతి వాసవీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ ఖైరతాబాద్‌లో ఉంటుంది. సౌమ్య శుక్రవారం సాయంత్రి డ్యూటీ వెళ్లాల్సి ఉండగా రాకపోవడంతో ఆమెను స్నేహితుడు ప్రశాంత్ ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమె ఉండే రూమ్‌కు వెళ్లాడు. తలుపులు తెరిచి చూడా బాత్రూమ్ ఆమె అచేతనంగా పడిఉంది. వెంటనే అతడు హీటర్ స్విచ్ ఆఫ్ చేసి స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై కాలిన గాయాలు ఉండడంతో షార్ట్ సర్కూట్‌తోనే చనిపోయి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కరీంనగర్ కు చెందిన యువతిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News