మంత్రి దామోదర రాజనర్సింహ
ఆదేశం కేసు పూర్వాపరాలను
సమీక్షించిన మంత్రి
తమిళనాడు, కేరళ, కర్ణాటక
ప్రభుత్వాలకు సమాచారం
ఇవ్వాలని అధికారులకు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: అలకనంద హా స్పిటల్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీ కి అప్పగించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించా రు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెం టనే విడుదల చే యాలని ఆరోగ్య శాఖ కార్యద ర్శి క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించా రు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు.కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. నగరంలోని అలకనంద హాస్పిటల్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు.
అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారని పేర్కొన్నారు. అలకనంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. అలకనంద హాస్పిటల్‌ను సీజ్ చేశామని, హాస్పిటల్ ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి వివరించారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా అన్నది ఆరా తీయాలని దిశానిర్ధేశం చేశారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా విచారణ జరపాలని ఆదేశించారు.
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలని చెప్పారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర్ సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. హాస్పిటళ్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహించాలని గతంలోనే మంత్రి ఆదేశాలు జారీ చేశారు.