Wednesday, January 22, 2025

హైదరాబాద్ లైఫ్‌సైన్స్ హబ్‌గా మారుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతంగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మాదాపూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసింగించారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ చేరుకుందన్నారు. దేశంలో 40 శాతం పైగా ఫార్మారంగ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయన్నారు. పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ లైఫ్‌సైన్స్ హబ్‌గా మారుతోందని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో టాలెంట్‌కు కొరత లేదని, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువే అని అన్నారు. హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ నగరం అని చెప్పారు.

Also Read: మాస్కు లేకుండా దగ్గినందుకు రెండేళ్ల జైలు శిక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News