Wednesday, March 26, 2025

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ఈ నెల 28న నోటిఫికేషన్
ఏప్రిల్ 23న పోలింగ్
25న ఓట్ల లెక్కింపు
మే 1తో ముగియనున్న ఎంఎల్‌సి
ప్రభాకర్ పదవీకాలం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబా ద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నిక షె డ్యూలు విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్ 29 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీన ముగియనుండటంతో ఎన్నికకు ఇసి షెడ్యూలు విడుదల చేసింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల సభ్యులంతా కలిసి ఎంఎల్‌సిని ఎన్నుకుంటారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 84 మంది కార్పోరేటర్లు ఉండగా, అందులో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంతో 80 మంది కార్పోరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీరితో పాటు ఈ ఎన్నికల్లో 35 మంది ఎక్స్ ఆఫిషీయో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News