ముంబయి: ఓ హైదరాబాదీని ముంబయి పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అతడు ఓ భారతీయ క్రికెటర్ 9 ఏళ్ల కూతురును రేప్ చేస్తానని బెదిరించాడన్న ఆరోపణపై అరెస్టు చేశారు. టి20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయినందుకు అతడు ఇలా చేశాడని తెలుస్తోంది. అతడిని రామ్నగేశ్ అలీబతినిగా పోలీసులు గుర్తించారు. అతడు తెలంగాణకు చెందిన ఓ ఐటి ఇంజనీర్ అని, పిహెచ్డి చేయడానికి తన ఉద్యోగాన్ని కూడా అతడు వదిలేసినట్లు తెలిసింది. బాంద్రా(తూర్పు) బికెసిలో సైబర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ అధికారి ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికా విలేకరికి తెలిపాడు. కాగా ఆ అధికారి తన పేరు బయటపెట్టవద్దని కూడా కోరుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో క్రికెటర్ చిన్నారిని రేప్ చేస్తానని బెదిరించిన అతడిని హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు, అయితే వివరాలు తర్వాత వెల్లడిస్తామని ముంబయి పోలీసులు తెలిపారని సమాచారం.
క్రికెటర్ చిన్నారిని బెదిరించినందుకు హైదరాబాదీ అరెస్టు!
- Advertisement -
- Advertisement -
- Advertisement -