Wednesday, January 22, 2025

ఒక ఏడాదిలో రూ. 6 లక్షల విలువైన ఇడ్లీలను కొన్న వ్యక్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ఇడ్లీని అమితంగా ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి తన కంటే ఇడ్లీ ప్రియుడు మరెవరూ ఉండరేమో అనే విధంగా ఇడ్లీలను ఆర్డర్ చేశారు. ఒక ఏడాదిలో ఆయన ఏకంగా రూ. 6 లక్షల విలువైన ఇడ్లీలను కొన్నారు. తన కుటుంబానికి, స్నేహితులకు కలిపి ఆయన 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారు. బెంగళూరు, చెన్నైకి వెళ్లిన సమయాల్లో ఆయన ఈ ఆర్డర్లు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఆహార డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వెల్లడించింది.

గురువారం అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్విగ్గీ ఈ విషయాన్ని తెలిపింది. 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 వరకు జరిగిన ఆర్డర్ల ఆధారంగా స్విగ్గీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గత 12 నెలల్లో 33 మిలియన్ల ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీ డెలివరీ చేసిందని తెలిపింది. ఇడ్లీలను ఎక్కువగా ఆర్డర్ చేసిన నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయని చెప్పింది. ఆ తర్వాత ముంబై, కోయంబత్తూర్, పూణె, వైజాగ్, ఢిల్లీ, కోల్ కతా, కొచ్చి నగరాలు ఉన్నాయని తెలిపింది.

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై నగరాల్లో భోజనం సమయాల్లో కూడా ఇడ్లీని ఆర్డర్ చేస్తున్నారు. బెంగళూరులో రవ్వ ఇడ్లీ పాపులర్ కాగా తెలంగాణ, ఎపి, తమిళనాడు రాష్ట్రాల్లో నెయ్యి ఇడ్లీ, నెయ్యి కారంపొడి ఇడ్లీకి ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News