Wednesday, January 22, 2025

కాంగ్రెస్ లో చేరిన గద్వాల విజయలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరికలు పోరుగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హస్తం కండువా కప్పి ఆమె పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్.. దీపాదాస్ మున్షి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ జాయిన్ అయ్యారు.

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె కేశవరావు కూడా రోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ రోజు లేదా రేపు ఆయన హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కడియం కూతరు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేయలేనని తప్పుకున్న సంగతి తెలసిిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News