హైదరాబాద్: జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదివారం యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్‌కు ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలుకగా, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మేయర్ విజయలక్ష్మిపలువురు మహిళా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఆలయ అద్భుత నిర్మాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమైక్యాంధ్రాలో ఏలాంటి అభివృద్దికి నోచుకుని యాద్రాది లక్ష్మి నరసింహా ఆలయాన్ని స్వరాష్ట్ర సిద్దించిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కేవలం 7 ఏళ్ల కాలంలో దేశంలోనే గొప్ప కళా ఖండంతో కూడిన అతిపెద్ద దేవాలయంగా తీర్చిదిద్దారన్నారు. భవిష్యత్‌లో యాద్రాదికి లక్షలాదిమంది దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అద్భుతమైన ఆలయా నిర్మాణాన్ని శిల్పిల నిర్మిస్తూ స్వయంగా పనులు పర్యవేక్షిస్తూ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సిఎం కెసిఆర్‌కు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.
యాద్రాది లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి
- Advertisement -
- Advertisement -
- Advertisement -